Nellore : ఘనంగా బారాషాహీద్ దర్గ వద్ద గంధ మహోత్సవం.. లక్షల మంది భక్తులు హాజరు

Nellore : ఘనంగా బారాషాహీద్ దర్గ వద్ద గంధ మహోత్సవం.. లక్షల మంది భక్తులు హాజరు
X

నెల్లూరు బారాషాహిద్ దర్గ వద్ద ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగలో భాగంగా గంధ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధమహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి 12 బిందెలతో గంధాన్ని ఊరేగింపుగా బారాషాహిద్ దర్గా ఈద్గా వరకు తీసుకువచ్చారు. అక్కడ ప్రార్థనలు నిర్వహించి, పకీర్ల విన్యాసాల అనంతరం గంధం ఊరేగింపుగా దర్గాలోకి తీసుకువెళ్లారు. కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బారాషాహిద్ సమాధులకు గంధాన్ని లేపనం చేశారు.కాగా భారీగా తరలివచ్చిన భక్తులు గంధాన్ని అందుకునేందుకు పోటీపడ్డారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు.

Tags

Next Story