ఎపిసిరో అధినేత వట్టి విజయ్‌ దంపతులకు ఘనస్వాగతం

ఎపిసిరో అధినేత వట్టి విజయ్‌ దంపతులకు ఘనస్వాగతం
చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన వట్టి విజయ్.. ఎపిసిరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని స్థాపించే స్థాయికి ఎదిగారు.

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎపిసిరో సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత వట్టి విజయ్‌ దంపతులకు ఘనస్వాగతం లభించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కుటుంబ సభ్యులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అపూర్వ స్వాగతం పలికారు. తాడేపల్లిగూడెంలోని మాధవరం గ్రామానికి చెందిన వట్టి విజయ్.. 2001లో హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి 8 ఏళ్ల క్రితం ఉద్యోగ వేటలో అమెరికా పయనమయ్యారు. చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన వట్టి విజయ్.. ఎపిసిరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని స్థాపించే స్థాయికి ఎదిగారు. వెయ్యి కోట్ల టర్నోవర్‌తో సత్తా చాటుతున్న ఎపిసిరో కంపెనీ.. ఇటీవలే ఫోర్బ్స్‌లో స్థానం దక్కించుకుంది. వందలాది మంది తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తన కంపెనీలో ఉద్యోగ అవకాశాలను కల్పించారు వట్టి విజయ్.

అమెరికాలో ఎపిసిరో సాప్ట్‌వేర్ కంపెనీని స్థాపించి ఈ స్థాయికి రావడం గర్వంగా ఉందన్నారు వట్టి విజయ్. తల్లిదండ్రులు నారాయణరావు, సుబ్బాయమ్మ ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు.

Tags

Read MoreRead Less
Next Story