Visakhapatnam: పెళ్లి ఇష్టంలేదన్న వరుడు.. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో..

X
By - Divya Reddy |12 May 2022 4:45 PM IST
Visakhapatnam: కొన్నిగంటల్లో పెళ్ళి..ఇంతలోనే విషాదం.. వరుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
Visakhapatnam: ఇళ్ళంతా పెళ్ళిసందడి.. బంధువులతో హడావుడి.. కొన్నిగంటల్లో పెళ్ళి..ఇంతలోనే విషాదం నెలకొంది.. పెళ్ళికొడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ జిల్లా మల్కాపురం జయేంద్రకాలనీలో చోటుచేసుకుంది. పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేని దినేష్‌కు తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. అప్పటికే పలుసార్లు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పినా వినిపించుకోలేదు. దీంతో పెళ్ళి అవుతుందన్న దిగాలుతో దినేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కెజిహెచ్ కు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com