గ్రూప్ -1 తర్వాతే గ్రూప్-2 జాబితా.. ఏపీపీఎస్సీ కీలక ప్రకటన

ఏపీపీఎస్సీ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్_1 ఉద్యోగాల ఎంపిక పూర్తి అయిన తరువాతే గ్రూప్_2 ఎంపిక ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది. గ్రూప్-1 ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన వారి జాబితాను త్వరలో ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో మెరిట్ ప్రాతిపదికన ఉన్న స్పోర్ట్స్ జాబితా ను రాష్ట్ర ఉన్నతాధికారుల కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ కమిటీ పంపించే నివేదికను అనుసరించి గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడిస్తుంది. ఈ ప్రక్రియకు దాదాపు వారం సమయం పట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తి అయిన రెండు వారాల తర్వాత గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేయనుంది ఏపీపీఎస్సీ. ఐతే గ్రూప్-1 ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో సుమారు 30 మంది గ్రూప్-2 ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారని,..ఈ నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com