Pawan Kalyan : అమల్లోకి జీఎస్టీ 2.. మోదీకి పవన్, లోకేశ్ థ్యాంక్స్

దేశవ్యాప్తంగా ఈ రోజు అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక శుభదినమని ఆయన అభివర్ణించారు. ఈ నూతన సంస్కరణలను తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
"శరన్నవరాత్రుల వేళ ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో శుభకరమైన రోజు. జీఎస్టీ బచత్ ఉత్సవ్, స్వదేశీ వస్తువులకు మద్దతు వంటి కార్యక్రమాల ద్వారా రైతులు, పరిశ్రమలు, తయారీ రంగం, ఎంఎస్ఎంఈలకు సాధికారత లభిస్తుంది. అదే సమయంలో నిత్యావసర వస్తువులు, సేవలు సామాన్యులకు మరింత అందుబాటులోకి వస్తాయి" అని పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సంస్కరణలు వికసిత భారత్ 2047, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.
నారా లోకేశ్ స్పందన: మంత్రి నారా లోకేశ్ కూడా జీఎస్టీ 2.0ను స్వాగతించారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో తక్కువ పన్ను రేట్లతో సరళమైన విధానం వచ్చిందని ఆయన తెలిపారు. ఇది మహిళలు, వినియోగదారులు, వ్యాపారులకు మేలు చేస్తుందన్నారు. గతంలో పన్నుల గందరగోళం ఉండేదని, ఇప్పుడు ప్రతి ఇంటికీ ఇది జీఎస్టీ బచత్ ఉత్సవ్‌గా మారిందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com