గుంటూరులో ఉద్యోగ సంఘాల భారీ ర్యాలీ

గుంటూరులో ఉద్యోగ సంఘాల భారీ ర్యాలీ
జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా గుంటూరులో ఉద్యోగ సంఘాల భేరీ మోగింది. అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా గుంటూరులో ఉద్యోగ సంఘాల భేరీ మోగింది. అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు బొప్పరాజు ఆధ్వర్యంలో జరగనున్న 4వ ప్రాంతీయ సదస్సుకు ఉద్యోగులు భారీగా హాజరయ్యారు. గుంటూరు కన్నవారితోట మూడు బొమ్మల కూడలి నుంచి… కలెక్టర్‌ కార్యాలయం మీదుగా రెవెన్యూ భవన్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నుంచి భారీగా ర్యాలీలో పాల్గొంటున్న ఉద్యోగులు… తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

Tags

Next Story