Krishna River : కృష్ణానదిలో భారీ వరద.. శ్రీశైలానికి పెరిగి ఉద్ధృతి

Krishna River : కృష్ణానదిలో భారీ వరద.. శ్రీశైలానికి పెరిగి ఉద్ధృతి
X

కృష్ణా నది జలకళను సంతరించుకుని ఉరకలెత్తుతోంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో కురిసిన భారీ వర్షాలకు భారీగా నీరు వచ్చి చేరడంతో తెలుగు రాష్ట్రాలలో దిగువన ఉన్న కృష్ణానది నిండుకుండలా మారింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో ఆల్మట్టి డ్యామ్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు 14 గేట్లు ఎత్తివేశారు. దీనితో 65 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది.

ముందు జాగ్రత్తగా కర్ణాటక అధికారులు అల్మట్టి పరిసర ప్రాంతాలలో ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అల్మట్టి పూర్తి స్థాయి నీటిమట్టం 129 టీఎంసీలు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 100 టీఎంసీల నీరు చేరడంతో ముందు జాగ్రత్తగా అధికారులు నీటిని క్రమంగా కిందికి వదులుతున్నారు. దిగువ ప్రాంతమైన నారాయణపూర్ డ్యామ్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు కూడా అధికంగా నీటి మట్టం పెరుగుతోంది. దాంతో జూరాలలో జల విద్యుత్ పనులు అధికారులు మొదలుపెట్టారు.

శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండటానికి మరో 80 టీఎంసీల చేరువలో ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో మరో 5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. మరోవైపు వరుసగా అల్పపీడనాలు.. దీనితో రుతుపవనాలు చురుకుగా సాగటంతో తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీనితో శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీరు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వరద పరిస్థితులు ఎదుర్కోవడానికి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు.

Tags

Next Story