Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు

Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు
X

కృష్ణా నది ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో సుమారు 2,73,659 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 882.60 అడుగులుకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ఇప్పుడు సుమారు 202.9673 టీఎంసీలుగా ఉంది. రద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాజెక్టు యొక్క 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు ప్రస్తుతం సుమారు 2,81,398 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. కుడి, ఎడమ గట్లపై ఉన్న జలవిద్యుత్ కేంద్రాల ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచే వర్షాలు సమృద్ధిగా కురవడంతో, శ్రీశైలం జలాశయం జూలై మొదటి వారంలోనే నిండిపోయింది. సాధారణంగా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ నెలలో గేట్లు ఎత్తడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది మూడు వారాల ముందే గేట్లు ఎత్తివేయడం విశేషం. పర్యాటకులు ఈ దృశ్యాలను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Tags

Next Story