Heavy Rains : అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీవర్ష సూచన

Heavy Rains : అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీవర్ష సూచన
X

అల్పపీడన ప్రభావంతో APలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటోంది. అయితే కోస్తా జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

ఏపీ మీద అల్పపీడనాల ప్రభావం కనిపిస్తోంది. జూన్‌ 28, జులై 15, 19, ఆగస్టు 3, 29, సెప్టెంబరు 5, 13, 23 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికే 8 సార్లు అల్పపీడనాలు భయపెట్టాయి. ఈ ఎనిమిది అల్పపీడనాలలో ఐదు వాయుగుండాలుగా బలపడి, తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించాయి.

అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో వానలు పడతాయంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఓ మోస్తరు తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

Tags

Next Story