AP : ఏపీలో 3 రోజులు భారీవర్ష సూచన

AP : ఏపీలో 3 రోజులు భారీవర్ష సూచన
X

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. వచ్చే మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Tags

Next Story