Andhra Pradesh Rains : ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Andhra Pradesh Rains : బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. నెల్లూరులో పంబలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కాలువను దాటేందుకు ప్రయత్నించిన కొందరు విద్యార్థులు.. కాలు జారిపడిపోయి... కాలువలో కొట్టుకుపోయారు. అయితే స్థానికుల సహాయంలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అక్కడివారంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటు కడప జిల్లాలోనూ ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోడూరు మండలం బాలపల్లిలో కుండపోత కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో తిరుపతి, కోడూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోవడతో ప్రయాణికులు తీవ్ర అవప్థలు పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com