AP : జిల్లాల్లో భారీ వర్షాలు .. ఇవాళ స్కూళ్లకు సెలవు

AP : జిల్లాల్లో భారీ వర్షాలు .. ఇవాళ స్కూళ్లకు సెలవు
X

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈ ఆదేశాలను యాజమాన్యాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.

అధికారులు కేవలం వర్షాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సెలవు ఇవ్వట్లేదు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. వర్షం పడే సమయంలో స్కూళ్లు ఉంటే.. చాలా చోట్ల కరెంటు తీగలు ఊడి.. నీళ్లలో పడి.. కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడగలవు. పైగా వర్షంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. స్కూళ్లు తెరిస్తే, స్కూల్ వాహనాలు కూడా రోడ్డెక్కితే, ట్రాఫిక్ సమస్య ఉంటుంది. వర్షంలో తడిస్తే, జలుబు, జ్వరం రాగలవు. ఇలా ఎన్నో అంశాల్ని దృష్టిలో పెట్టుకొని సెలవు ఇస్తారు. అందువల్ల సెలవు ఉన్న రోజున విద్యార్థులను బలవంతంగా స్కూళ్లకు పిలిస్తే, అది నేరమే అవుతుంది. అలాంటి స్కూళ్లపై కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి.

Tags

Next Story