Nellore Rains : కుండపోత వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం..!

Nellore Rains : కుండపోత వర్షాలతో నెల్లూరుజిల్లా అతలాకుతలం అవుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు.. తాజా అల్పపీడనం.. జిల్లా ప్రజల పాలిట శాపంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో.. పంట పోలాలు చెరువులను తలపిస్తున్నాయి. నదులు , చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈనేపథ్యంలో స్వర్ణముఖినదికి నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో స్వర్ణముఖి నది, మామిడికాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నది పరివాహక ప్రాంతా ప్రజలను లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.కలకకూరు, కాగుంట, కండ్రిగ చెక్ డ్యాంల వద్ద స్వర్ణముఖి నది ప్రవాహనికి.. నాలుగు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
కలువాయి మండలం కమ్మపాలెంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్సీ కాలనీలు నీట మునిగాయి. వరద ధాటికి రెండు ఇళ్లు కూలిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు 40 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. రావూరు మండలంలోని ఆంజనేయులు, సైదాదుపల్లి, పెనుబర్తి గ్రామల్లోని SC St కాలనీలను వరద నీరు ముంచెత్తింది. మోకాల్లోతూ నీళ్లతో ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. వరద నీటిలో నిత్యవసర వస్తువులు మునిగిపోయాయి. ఎడతెరపి లేని వర్షాలకు రెండు రోజుల నుంచి నీటిలోనే గడుపుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో టీడీపీ నేలు కాజా ఆయాగ్రామంలో నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.
భారీ వర్షాలకు ధాటికి సీతారామపురం మండలం పొలంగారి పల్లి- సిద్దేశ్వరం వెళ్లే మార్గం మధ్యలో దేవమ్మ చెరువు, వేపంల్లితోక వద్ద వంతెన కూలిపోయింది. దీంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగుల వెల్లటూరు వరదల్లో 40 మేకలు కొట్టుకుపోయాయి. ఒక్క సారిగా వరద ఉధృతి పెరగడంతో మేకలు కొట్టుకుపోయాయని రైతులు లబోదిబోమంటున్నారు.బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లిఖార్జున సమేత కామాక్షి ఆలయం వరదనీటితో నీటమునిగింది. పక్కనే ఉన్న పెన్ననదికి వరద నీరు పోటెత్తడంతో.. ఆలయంలోని స్వామి వారి విగ్రహం నేలకొరిగింది. దీంతో ఆలయ అధికారులు .. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండ మరో విగ్రహన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈనేపథ్యంలో శివయ్య స్వామిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com