Vijayawada : బెజవాడలో ఆహారం అందిస్తున్న హెలికాప్టర్లు, డ్రోన్లు

Vijayawada : బెజవాడలో ఆహారం అందిస్తున్న హెలికాప్టర్లు, డ్రోన్లు

విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. బాధితులకు ఆహారం అందిస్తున్నాయి. కండ్రిక, పాయకాపురం, పాత రాజరాజేశ్వరీ పేటలో ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లపై వద బాధితులకు హెలికాప్టర్‌ నుంచి కిందకు ఆహారపొట్లాలను జారవిడిచారు. పెద్ద పెద్ద భవనాల మధ్య హెలికాప్టర్లు చక్కర్లు కొడుతుండటంతో జనం వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

డ్రోన్లను ఉపయోగించి విజయవాడ వరద భాధితులకు ఆహారం అందజేస్తున్నారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. దీంతో డ్రోన్లను ఉపయోగించి విజయవాడ వరద భాధితులకు ఆహారం అందజేస్తున్నారు. వరదలో వెళ్లలోని పరిస్థితుల్లో డ్రోన్లు ప్రయోగించి ఆహారాన్ని అందజేస్తుండటంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story