సాక్షి తప్పుడు రాతలు.. హెరిటేజ్ దెబ్బకు సైలెంట్

వైసీపీకి చెందిన సాక్షి మీడియా ఈ మధ్య మరీ బరితెగించి తప్పుడు రాతలు రాస్తోంది. స్వయంగా వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకసారి మాట్లాడుతూ తాను సాక్షి మీడియాలో వచ్చే వాటిని అసలు నమ్మనని.. దానితో తనకు సంబంధం లేదు అంటూ చెప్పేశారు. అయినా సరే ఆయన సతీమణి నడిపే సాక్షి మీడియా కూటమి ప్రభుత్వం మీద తప్పుడు రాతలు రాస్తూ బురదజల్లే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంది. ఇప్పుడు వైసీపీ నేతల మీద తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసు ఎంత పెద్ద సంచలనం రేపుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. హిందూ సమాజం మొత్తం వారి తీరును తీవ్రస్థాయిలో ఎండ గడుతోంది. దీంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు సాక్షి మీడియా కొత్త రాగాన్ని ఎత్తుకుంది.
హెరిటేజ్ కంపెనీకి బోలెబాబా డెయిరీకి సంబంధం ఉంది అంటూ ఓ తప్పుడు వార్త రాసేసింది. దీనిపై హెరిటేజ్ సంస్థ సీరియస్ అయింది. ఎందుకంటే బోలెబాబా ఆర్గానిక్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది ఝార్ఖండ్ లో రిజిస్టర్ అయిన కంపెనీ. అది జైనుల కంపెనీ. దానితో హెరిటేజ్ కు కొన్ని వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కానీ సాక్షి మీడియా చెబుతున్న తిరుమల లడ్డులో కల్తి నెయ్యి సరఫరా చేసిన బోలెబాబా డెయిరీ ఇది కాదు. హెరిటేజ్ కు వ్యాపార సంబంధాలు ఉన్న బోలె బాబా డైరీ జార్ఖండ్ కు చెందినది. కానీ తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసింది ఈ కంపెనీ కాదు.
రెండు డెయిరీల పేరు మొదట్లో ఒకటే ఉంది. కానీ రెండు సంస్థలు ఒకటి కాదు. ఈ విషయం క్లియర్ గా చెప్పకుండా హెరిటేజ్ ను బద్నాం చేయడానికి సాక్షి మీడియా ఇలాంటి తప్పుడు వార్తలు రాసేసింది. దీని మీద హెరిటేజ్ సంస్థ స్పందిస్తూ వివరణ ఇచ్చింది. సాక్షి మీడియా వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించింది. దీంతో భయపడిపోయిన సాక్షి మీడియా ఓ వివరణ ఇచ్చింది. కానీ వైసీపీ హయాంలో హెరిటేజ్ తో బోలే బాబా డెయిరీకి సంబంధం ఉంటే నిజంగా టెండర్లు ఇచ్చేవారా. చంద్రబాబు నాయుడు కంపెనీకి ఎవరితో సంబంధం ఉన్నా సరే వారిని తొక్కేయాలని చూసే వైసిపి.. ఆ కంపెనీతో సంబంధం ఉన్న బోలె బాబా డెయిరీకి టెండర్లు ఇవ్వదు అని విషయం తెలిసి కూడా సాక్షి ఇలాంటి తప్పుడు వార్తలు రాసి తన పరుగులు మరోసారి పోగొట్టుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
