Jr NTR : మావయ్య మీరు త్వరగా కోలుకోవాలి : జూనియర్ ఎన్టీఆర్

Jr. NTR : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా చేసిన కరోనా టెస్టులో స్వల్ప లక్షణాలతో పాజిటివ్ వచ్చినట్లుగా ఈ రోజు (మంగళవారం) ఉదయం ట్వీట్ చేశారు చంద్రబాబు... ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లుగా వెల్లడించారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయిన వారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు చంద్రబాబు. ఈ క్రమంలో చంద్రబాబు త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. " మామయ్య(చంద్రబాబు) మీరు త్వరగా కోలుకోవాలి.. నారా లోకేష్ కూడా కరోనా నుంచి బయటపడాలి" అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
Wishing you Mavayya @ncbn garu and @naralokesh a speedy recovery. Get well soon! https://t.co/cygw7hmARc
— Jr NTR (@tarak9999) January 18, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com