ఆంధ్రప్రదేశ్

AP High Court: ఏపీలో ట్రాఫిక్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

AP High Court: ట్రాఫిక్‌ చలాన్లు కట్టాలంటూ ఒత్తిడి చేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

AP High Court: ఏపీలో ట్రాఫిక్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
X

AP High Court: ట్రాఫిక్ చలాన్లు కట్టలేదనే కారణంతో పదేపదే ఫోన్ చేసి వేధించే అధికారం పోలీసులకు లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపించలేదని ఓ ఫొటో తీసి, దానికి చలాన్‌ చెల్లించాలంటూ ఒత్తిడి చేయడం ఏంటని నిలదీసింది. అసలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపించలేదు అనడానికి 'ఫొటో ఎలా సాక్ష్యం అవుతుందని ప్రశ్నించింది.

లైసెన్స్‌ చూపించలేదని, హెల్మెట్‌ పెట్టుకోలేదని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ పేరుతో.. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీసులు చలాన్‌లు విధించడాన్ని సవాలు చేస్తూ తాతినేని లీలాకృష్ణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

వాహనదారులు మోటారు వాహన చట్టం నిబంధలను ఉల్లంఘిస్తే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు.. ఫోన్‌లు చేసి వేధింపులు ఎందుకంటూ పోలీసుల తీరును తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్‌పీని ఆదేశించింది.

ఈ పిటిషన్‌పై తాతినేని లీలాకృష్ణ తరపున అడ్వొకేట్‌ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపించారు. పిటిషనర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపించలేదని చెప్తున్న పోలీసులు.. అందుకు వారు తీసిన ఫొటోను సాక్ష్యంగా చూపించడాన్ని తప్పుపట్టారు. ఈ ఫొటో లైసెన్స్ లేదు అనడానికి ఎలా రుజువు అవుతుందని వాదించారు.

పిటిషనర్‌కు లైసెన్స్ ఉందని స్పష్టం చేశారు. పోలీసులు చూపిస్తున్న ఫొటోలో వ్యక్తి పిటిషనర్‌ కాదని, అలాగే ఆ వాహనం కూడా ఆయనది కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం వాహనం నంబర్‌ మాత్రమే పిటిషనర్‌దని, దాని ఆధారంగా చలాన్ చెల్లించాలంటూ పదేపదే ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. దీనిపై వాదనలు విన్న కోర్టు.. తదురి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది .

Next Story

RELATED STORIES