ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
AP High Court: ఉపాధి హామీ పథకం బిల్లులపై విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.

AP High Court: ఉపాధి హామీ పథకం బిల్లులపై విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. 1794 కోట్లకు గాను 413 కోట్లు చెల్లించామని అధికారులు తెలుపగా.. కేవలం 43 కోట్లు మాత్రమే చెల్లించారని డిఫెన్స్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో.. పూర్తి డేటాతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి డేటాతో అధికారులు ఎందుకు రాలేకపోతున్నారని నిలదీసింది. హాజరు కావాలని చెప్పినా అధికారుల్లో ఒకరు ఎందుకు రాలేదని ప్రశ్నించింది.

ఢిల్లీలో మీటింగ్ అని ఒకసారి, ఆర్బిట్రేషన్ అని మరోసారి సాకులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చెప్పే సాకులు కౌంటర్‌లో కూడా లేవన్న ధర్మాసనం.. ఇలానే వ్యవహరిస్తే చాలా సీరియస్‌గా వ్యవహరించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మీరు చెప్పే మాటలపై నమ్మకం పోయిందని.. అందువల్లే ప్రమాణ పత్రం దాఖలు చేయండని ఆదేశించింది.

ఇక ముందు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంటామన్న ధర్మాసనం...ప్రతి బిల్లులో 20 శాతం ఎందుకు మినహాయిస్తున్నారని.. మినహాయించిన డబ్బును ఎక్కడ ఉంచుతున్నారని ప్రశ్నించింది. ఎటువంటి వివరాలు లేకుండా హైకోర్టుకు ఎందుకు వస్తున్నారని నిలదీసింది. ఆగస్టు 18వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసిన కోర్టు.. అధికారులంతా మళ్లీ వ్యక్తిగతంగా హాజరు కావాలని.. ఇదే పరిస్థితి పునరావృతమైతే ఉపేక్షించబోమని హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story