AP High Court: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు ఆదేశాలు..

X
By - Prasanna |16 Dec 2021 12:37 PM IST
AP High Court: తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది
AP High Court: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.
కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సినిమా టికెట్లపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు థియేటర్ యజమానులు. దీంతో ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది ప్రభుత్వం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com