Ashok Gajapathi Raju: అశోక్ గజపతిరాజుపై నమోదైన కేసులో హైకోర్టు స్టే..

Ashok Gajapathi Raju: టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై నమోదైన కేసులో స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు. రామతీర్థంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీన్ని హైకోర్టులో సవాల్ చేశారు అశోక్ గజపతిరాజు.
దీనిపై ఇవాళ విచారణ చేపట్టింది ధర్మస్థానం. పిటిషనర్ అశోక్ గజపతిరాజు తరుపున వాదనలు విపించారు న్యాయవాది అశ్విన్ కుమార్. పిటిషనర్ అశోక్ గజపతిరాజుకు 353 యాక్ట్ వర్తించదని.. పైగా ఫిర్యాదుదారుడు 353 యాక్ట్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు అందించలేదని వాదించారు అశ్విన్ కుమార్. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసులో స్టే ఇచ్చింది. అశోక్ గజపతిరాజుపై తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com