మాచర్లలో హైటెన్షన్.. బ్రహ్మారెడ్డి జన్మదిన వేడుకలపై పోలీసుల ఆంక్షలు

పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి జన్మదిన వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. 30 యాక్టు అమలులో ఉన్నందున ర్యాలీలు నిర్వహించొద్దని ఆదేశించారు. ఎవరూ వేడుకలకు రావద్దని నోటీసులిచ్చారు. పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలను బైండోవర్ చేశారు. రాయవరం కూడలిలోని ప్రైవేటు స్థలంలో బ్రహ్మారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. పది వేల మంది భోజనాలు చేసేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ లోగా శాంతిభద్రతల సమస్య పేరుతో పోలీసులు నోటీసులిచ్చారు. దాంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్రంలో జన్మదిన వేడుకలు కూడా నిర్వహించే హక్కు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అటు బర్త్‌డే వేడుకల సభలో శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదనే ముందస్తుగా నోటీసులిచ్చామని గురజాల డీఎస్పీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com