AP High Alert : ఏపీలో రేపు, ఎల్లుండి సెలవులు.. వర్షాలతో అధికారులు హైఅలర్ట్

AP High Alert : ఏపీలో రేపు, ఎల్లుండి సెలవులు.. వర్షాలతో అధికారులు హైఅలర్ట్
X

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరదలు, ముంపు ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా నగరంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో ఈనెల 16, 17వ తేదీలలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టల్స్ లకు సెలవు ప్రకటించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఆరు షెల్టర్ హోమ్స్ జాబితా తయారు చేశామన్నారు. ఈనెల 16, 17వ తేదీలలో రెండు రోజులపాటు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

Tags

Next Story