Home Minister Anitha : అన్నం, పాలు, నీటి ప్యాకెట్లు పంచిన హోంమంత్రి అనిత
విజయవాడలో వరద బాధితులకు సహాయం యుద్ధప్రాతిపదికన అందుతోంది. స్వయంగా ముఖ్యమంత్రే ఫీల్డ్ లో మూడురోజులుగా ఉంటూ ఉండటంతో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. మంత్రులే స్వయంగా బాధితులకు ఆహారం అందించే బాధ్యతలు తీసుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ట్రాక్టర్‌పై ముంపు ప్రాంతాలకు వెళ్లి వరద బాధితులకు ఆహారం, తాగునీటిని పంపిణీ చేశారు.
బాధితులకు అండగా ఉంటామని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ట్రాక్టర్‌పై ఇంటింటికీ వెళ్ళి ఆహార పొట్లాలను అందించారు. అటు విజయవాడలో వరద ముంపు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు భారీగా ఆహార పొట్లాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇతర జిల్లాల నుంచి ఇందిరా గాంధీ స్టేడియంకు లారీల్లో ఫుడ్ ప్యాకెట్లు, ఫ్రూట్లు, వాటర్ ప్యాకెట్లు చేరుకున్నాయి.
నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు ఆహార ప్యాకెట్ల పంపిణీని మంత్రి నారాయణ పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే 2 ప్యాకెట్ల ఆహారం ఉదయం టిఫిన్ కోసం పంపించామన్నారు. 3 లక్షల వాటర్ బాటిల్స్ కూడా బాధితులకు పంపిణీ చేశామన్నారు. వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా విజయవాడలోనే ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com