AP : ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం కొనసాగింపు

AP : ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం కొనసాగింపు
X

ఏపీలో మసీదుల ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇమామ్‌లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. 2024 ఏప్రిల్ నుంచి ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం ఏటా రూ.90 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి N.MD. ఫరూక్ తెలిపారు. మైనార్టీల సంక్షేమాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని.. అసలు వారిని పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు మంత్రి. మరోవైపు రాష్ట్రంలోని ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు, ప్రత్యేక కోర్టుల పనితీరుపై మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో.. న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవితో పలు అంశాలపై చర్చించారు.

Tags

Next Story