YSRCP : క్రెడిట్ విషయంలో అడ్డంగా ‘బుక్క’య్యారు కదా!

ఉత్తరాంధ్ర మణిహారంగా భావించే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టును ఎలా పక్కన పెట్టారు, దానివల్ల జరిగిన నష్టం ఏమిటనే అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణ పూర్తి చేసి, పనులు ప్రారంభించే స్థాయికి తీసుకొచ్చారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్, కేవలం రాజకీయం కోసమే ఈ ప్రాజెక్టును మూలన పడేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. సుమారు ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోవడమే కాకుండా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి అది పెద్ద ఆటంకంగా మారింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన మేజర్ ప్రాజెక్టులలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా ఒకటి. అయితే జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రం వద్ద గట్టిగా వినిపించడంలో విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం తన సొంత అజెండా, ఇసుక, మద్యం కుంభకోణాలపై ఉన్న శ్రద్ధ జగన్ సర్కార్‌కు రాష్ట్ర ప్రయోజనాలపై లేదనే విమర్శలు వస్తున్నాయి.
అడ్డగోలు వాదనలతో కాలయాపన, నిర్మాణ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను మార్చడం, మళ్లీ టెండర్లు పిలవడం వంటి సాకులు చెబుతూ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాలయాపన చేశారని పలువురు మేధావులు వివరించారు. భోగాపురం భూములను రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లేలా జగన్ ప్రభుత్వం తెరవెనుక చక్రం తిప్పిందని, అందువల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని పేర్కొన్నారు. అయితే నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని పరిస్థితి ఏలా ఉంతో మనందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సవరించి, గడువులోగా ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జగన్ రెడ్డి తన స్వార్థం కోసం చేసిన ఆలస్యం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు దక్కాల్సిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చేజారిపోయాయని, దీనికి ఆయన కచ్చితంగా బాధ్యత వహించాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న నేతగా జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిగిలి పోతారనడంలో ఎలాంటి సందేహం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags
- Bhogapuram International Airport
- Uttarandhra development
- Andhra Pradesh infrastructure
- YSR Congress Party
- YS Jagan Mohan Reddy
- Chandrababu Naidu
- TDP government
- coalition government
- airport project delay
- land acquisition
- political negligence
- regional development
- Andhra Pradesh bifurcation projects
- Andhra Pradesh News
- TV5 News
- Latest Telugu News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

