YSRCP : అధికారులను వాడుకుని వదిలేస్తారా? ఇంకా జగన్‌కు సపోర్ట్ చేస్తున్న ఐఏఎస్ అధికారుల.

వైసీపీకి అధికారుల సపోర్ట్.. సునీల్ నాయక్ జగన్ తన అవసరాలకు అధికారులను ఎలా వాడుకుంటారనేది అందరికీ తెలిసిందే. అవసరం తీరిపోయిన తర్వాత వారిని పక్కన పెట్టేయడం కూడా ఇప్పుడు స్వయంగా అందరూ చూస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉను్నప్పుడు అధికారులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతలను దారునంగా వేధించారు. తప్పుడు కేసులు పెట్టించారు. దీంతో ఇప్పుడు ఆ అధికారులు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారు. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఏకంగా సస్పెండ్ అయ్యారు. రిటైర్డ్ అయ్యేదాకా ఆయన సస్పెన్షన్ కొనసాగనుంది. అలాగే సునీల్ నాయక్ ఇప్పుడు విచారణ ఎదుర్కుంటున్నారు. ఇంకొందరు ఐసీఎస్, ఐఏఎస్ అధికారులు లీగల్ గా సమస్యలు ఎదుర్కుంటొన్నారు. కొందరు జైలుకు కూడా వెళ్లారు. కానీ వారిని జగన్ ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు అధికారంలో లేకపోయినా సరే వైసీపీకి కొందరు ఐఏఎస్ అధికారులు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ కు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారంట. అలాగే వైసీపీకి అనుకూలంగా పనులు చేసి పెడుతున్నారు. ఇలాంటి వారి గురించే ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఎందుకంటే వైసీపీకి, జగన్ కు సపోర్ట్ చేసిన నేతలు ఎలాంటి లీగల్ సమస్యలు ఫేస్ చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. వారిని అవసరాలకు ఉపయోగించుకున్న తర్వాత జగన్ ఎలా పక్కన పెట్టేస్తారో కూడా కనిపిస్తోంది. అయినా సరే కొందరు అధికారులు ఇప్పుడు జగన్ బ్యాచ్ కు సపోర్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అందుకే సీఎం చంద్రబాబు పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు. అయినా సరే వారి తీరులో మార్పు రావట్లేదు. కాబట్టి వారికి కూడా గత అధికారులకు పట్టిన గతే పడుతుందని చెబుతున్నారు కూటమి నేతలు. ఇలాగే వ్యవహరిస్తే వారి ఉద్యోగాలకే ప్రమాదం అని.. కాబట్టి ఇకనైనా మారాలని చెబుతున్నారు.
Tags
- YS Jagan Mohan Reddy
- Chandrababu Naidu
- YSRCP
- Andhra Pradesh politics
- YSRCP leaders controversy
- IAS officers controversy AP
- CID Sunil Kumar suspension
- Sunil Naik investigation
- AP political news
- YSRCP vs TDP
- officials supporting YSRCP
- Andhra political updates
- AP government warning to officers
- bureaucrats controversy Andhra Pradesh
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
