Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .. రోడ్డు మీదే బారులు

Tirumala :  తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .. రోడ్డు మీదే బారులు
Tirumala : భక్తులు స్వామివారి దర్శనానికి పెద్దసంఖ్యలో తరలిరావడంతో ... తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులు స్వామివారి దర్శనానికి పెద్దసంఖ్యలో తరలిరావడంతో ... తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. వరుస సెలవులు రావడంతో తిరుమల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనం కోసం రోడ్డుమీదే కిలోమీటర్ల మేర బారులు తీరారు. అన్నప్రసాదం, వసతి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుపతిలోని కౌంటర్లలో ఈరోజు సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం నాటికి దర్శన స్లాట్ కేటాయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

తిరుమలలో రద్దీపెరుగడంతో భక్తులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్దులు, చంటిపిల్లల తల్లులు అవస్థలకు గురవుతున్నారు. ఒకవైపు తీవ్రమైన ఎండ.. మరోవైపు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూస్తున్నారు. టీటీడీ నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల అధిక రద్దీకారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లను ఒకరోజు ముందు.. అనగా మంగళవారం మధ్యాహ్నం నుండి ఇవ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.దీంతో మంగళవారం నాటి స్లాట్‌ పూర్తిగానే టోకెన్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భక్తుల రద్దీ కారణంగా ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్ల కేటాయింపులు ఉండవలని స్పష్టంచేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తరుమల యాత్రను రూపొందించుకోవాలని టీటీడీ సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story