AP లో దొంగ ఓట్ల..హవా..

AP లో దొంగ ఓట్ల..హవా..
X
ఒకే డోర్‌ నంబర్‌పై ఏకంగా 3 వేల ఓట్లు నమోదు కావడం కలకలం రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్లు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ విషయంలో ఎన్నికల అధికారులు చేతులు ఎత్తేసినట్లుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుంటూరు కార్పొరేషన్‌లో భారీ సంఖ్యలో దొంగ ఓట్లు వెలుగులోకి వచ్చాయి. ఒకే డోర్‌ నంబర్‌పై ఏకంగా 3 వేల ఓట్లు నమోదు కావడం కలకలం రేపుతోంది. గుంటూరు నగరంలోని పలు ఫేక్‌ డోర్‌ నంబర్లతో కొత్త ఓట్లు చేరుతుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది.కొన్ని చోట్ల దొంగ ఓట్లు చేర్చడం మరికొన్ని చోట్ల అసలు ఓట్లు తొలగించడం ఆందోళన కల్గిస్తోంది.భారీగా దొంగ ఓట్ల ఉదంతాలపై టీవీ5 కథనం సంచలనం రేపుతోంది. ఇదే అంశంపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అక్రమపద్ధతుల్లో గెలిచేందుకు అధికార పక్షం కుట్రలు పన్నుతోందంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

Tags

Next Story