Guntur: చంద్రబాబు నివాసానికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం..

X
Guntur: తాడేపల్లి కరకట్టపై భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కరకట్ట పక్కన ఎండిన అరటి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు భారీగా చెలరేగాయి. కరకట్టకు రెండు వైపులా మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో కరకట్ట మీద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసానికి కూతవేటు దూరంలోనే ప్రమాదం జరిగింది. ఐతే ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
