Vadapalli : వాడపల్లి వెంకన్నకు భారీ ఆదాయం

Vadapalli : వాడపల్లి వెంకన్నకు భారీ ఆదాయం
X

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 28 రోజులకు సుమారు కోటిన్నర రూపాయల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీవారి సేవకులు హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి రూ.1 కోటి 26 లక్షల 78 వేల 200 రూపాయలు, అన్న ప్రసాద హుండీల నుంచి 26 లక్షల 12 వేల 993 రూపాయలు. వెరసి 1 కోటి 52లక్షల 91 వేల 193 రూపాయల ఆదాయం వచ్చిందని డీసీ చక్రధరరావు తెలిపారు. అలాగే 47 గ్రాముల బంగారం, 1 కేజీ 600 గ్రాముల వెండి వస్తువులతో పాటు 11 దేశాలకు సంబందించిన 24 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు.

Tags

Next Story