అప్పుల కుప్పలా ఆంధ్రప్రదేశ్..!

అప్పుల కుప్పలా ఆంధ్రప్రదేశ్..!

Andhra Pradesh

Andhra Pradesh: ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్లో ఏపీ తీసుకున్న రుణం 17వేల 750 కోట్లకు చేరుకుంది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ అప్పుల కుప్పగా మారుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్లో ఏపీ తీసుకున్న రుణం 17వేల 750 కోట్లకు చేరుకుంది. తాజాగా అధిక వడ్డీకి రిజర్వు బ్యాంకు వద్ద రాష్ట్ర ప్రభుత్వం సెక్కూరిటీ బాండ్లును వేలం వేసింది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో ఒక వేయి 750 కోట్ల మేర రుణం పొందింది.

వెయ్యి కోట్ల రూపాయలను 14 సంవత్సరాల కాలపరిమితితో 7.12శాతం వడ్డీకి తీసుకుంది. మిగిలిన 750 కోట్ల అప్పుని 15 సంవత్సరాల కాలపరిమితితో 7.14 శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించింది. తొలి తొమ్మిది నెలల్లో కేంద్రం 20వేల 751 కోట్లు అప్పు తీసుకునేందుకు మాత్రమే ఏపీకి అనుమతిచ్చింది. ఈ లెక్కన చూస్తే డిసెంబరు వరకు కేవలం 3 కోట్లును మాత్రమే అప్పుగా తీసుకునేందుకు ఏపీకి అవకాశం ఉంది.

ఏపీ అప్పులపై కొన్నేళ్లుగా కేంద్రం దృష్టిపెట్టింది. ఎందుకు అప్పులు తీసుకుంటున్నారో లెక్కలన్నీ ఇవ్వాలని కోరింది. దాని ఆధారంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితిపై కోత పెట్టింది. దీంతో ఈ ఏడాది మొత్తం 27 వేల 688 కోట్ల అప్పుకే అవకాశం కల్పించింది. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రం ఎంత మేర అప్పు తీసుకోవాలో.. కేంద్రమే నిర్ణయిస్తుంది.

రిజర్వు బ్యాంకు ఆయా రాష్ట్రాలను సంప్రదించి ఏ రాష్ట్రం ఎప్పుడు ఎంత అప్పు తీసుకునే అవకాశం ఉందో క్యాలెండర్‌ను ముందుగా విడుదల చేస్తుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి జులై నుంచి సెప్టెంబరు వరకు రుణ క్యాలండర్‌ను రిజర్వు బ్యాంకు విడుదల చేసింది. దీని ప్రకారం ఏపీకి సెప్టెంబరు 7 వరకు మరో 5వేల కోట్లు రుణం తీసుకునే అవకాశముంది.

తమ పరిమితి మేరకే అప్పులు చేస్తున్నామని.. ఏపీ ప్రభుత్వం అంటోంది. రాష్ట్రాలు, కేంద్రం అప్పులు చేస్తునట్టే తామూ చేస్తున్నామని చెపుతోంది. ఇలా సేకరించిన నిధులను ప్రజా సంక్షేమ పథకాల కింద పేదలకే అందిస్తున్నామని చెపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్‌ రుణం డిసెంబరు వరకు ఇక పరిమితి 3వేల కోట్లకే ఉంది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4వేల 100 కోట్ల మేర గ్యారంటీల ఆధారంగా అప్పులూ తీసుకున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల మొత్తం పరిమితి లక్షా 6వేల 200 కోట్లకు మించకూడదు. ఇప్పటికే ఆ మేరకు ప్రభుత్వం గ్యారంటీలు కల్పించింది. దీంతో ఆ రూపేణా రుణం పొందే మార్గాలు తగ్గాయి.. దీంతో రిజర్వు బ్యాంకు కోత పెట్టిన రుణ పరిమితి నుంచి మినహాయింపు పొందే ప్రయత్నాలు, అందుకు అవసరమైన వాదన ఆర్థికశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story