Supreme Court : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట

Supreme Court : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట
X

సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్‌లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.

స్కిల్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు... చంద్రబాబుకు తొలుత తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ గా మార్చింది. దీంతో, చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

Tags

Next Story