Tirumala : భక్తజన సంద్రమైన తిరుమల.. 30 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్‌

Tirumala :  భక్తజన సంద్రమైన తిరుమల.. 30 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్‌
Tirumala : తిరుమల కొండ భక్తజనసంద్రంగా మారింది. టోకెన్లు లేకుండానే కొండపైకి అనుమతిస్తుండడంతో ఒక్కసారిగా భక్తులు భారీగా తరలివచ్చారు.

Tirumala : తిరుమల కొండ భక్తజనసంద్రంగా మారింది. టోకెన్లు లేకుండానే కొండపైకి అనుమతిస్తుండడంతో ఒక్కసారిగా భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తిరుమలలోని 30 కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో బయట భక్తులు క్యూ కట్టారు. అటు అలిపిరి నడకమార్గం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. కొండపై గదులు కూడా నిండిపోయాయి. భక్తుల భారీగా తరలి వస్తుండటంతో శ్రీవారి దర్శనం కోసం 20 నుంచి 30 గంటల సమయం పడుతోంది. తిరుమలకు వచ్చే భక్తులు రద్దీ చూసుకుని రావాలని టీటీడీ సూచించింది.

మరోవైపు తిరుమలలో సౌకర్యాలు లేక భక్తులు నానా కష్టాలు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా రూములు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమలలోని 2వేలకు పైగా గదులకు మరమ్మతులు చేయిస్తోంది టీటీడీ. రూములు ఖాళీ లేకపోవడంతో గదుల కేటాయింపు ఆఫీసును మూసేశారు. దీంతో రూములు దొరక్క.. ఫుట్‌పాత్‌లు, రోడ్లు, పార్కుల్లోనే సేదదీరుతున్నారు భక్తులు. అటు తలనీలాలు సమర్పించేందుకు కూడా అవస్థలు పడాల్సి వస్తోందని భక్తులు అంటున్నారు.

ప్రస్తుతం సర్వదర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులందరూ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండి, శ్రీవారిని దర్శించుకోవాల్సిందేనని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. దీంతో భక్తులు 15 నుంచి 20 గంటలు సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది.

ఇటు తిరుమలలో భక్తుల ఇక్కట్లపై టీడీపీ మండిపడింది. శ్రీవారికి భక్తుల్ని దూరం చేసేలా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచ స్థాయి గుర్తింపున్న తిరుమలకు పార్ట్‌ టైమ్‌ ఈవోను ఎలా నియామిస్తారని ప్రశ్నించారు. భక్తుల ఇబ్బందులు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌. లక్ష మందికి ఏర్పాట్లు చేయగలిగే TTD ఇప్పుడు భక్తులకు చలువ పందిళ్లు కూడా ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించారు. ఇవాళ్టి నుంచి తిరుమలలో మూడురోజుల పాటు సాలకట్ల వసంత్సోవాలు జరగుతుండటం...వరుస సెలవులు రావటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే ఛాన్స్ ఉందని టీటీడీ అధికారులు అంచానా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story