LOKESH:అశోక్ లేలాండ్ తో స్థానికులకు ఉద్యోగాలు

LOKESH:అశోక్ లేలాండ్ తో స్థానికులకు ఉద్యోగాలు
X
ఏటా 4, 800 బస్సుల ఉత్పత్తి... పారిశ్రామిక రంగంలో మైలురాయిగా అభివర్ణించిన లోకేశ్

కియా కార్లు, హీరో బైకులు, MI ఫోన్లతో పాటు ఇకపై అశోక్ లేలాండ్ బస్సులు, ట్రక్కులు కూడా ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ కింద లభించనున్నాయి. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో 75 ఎకరాల్లో నిర్మితమైన అశోక్ లేలాండ్ ప్లాంటును మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న ఈ కంపెనీ, ఏటా 4800 బస్సులు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండగా, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏపీలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని లోకేశ్ వెల్లడించారు. 75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కర్మాగారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక మైలురాయి కానుందని లోకేశ్ పేర్కొన్నారు. ఇక్కడ డీజిల్ మరియు ఎలక్ట్రిక్ బస్సులు ఉత్పత్తి చేస్తారని.... అశోక్ లేలాండ్ ప్లాంట్ ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని లోకేశ్ వెల్లడించారు. ఈ ప్లాంట్ ఏడాదికి 2400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఈ యూనిట్ ద్వారా ఫేజ్-1లో 600 మందికి ఉపాధి లభిస్తోంది. ఇక, ఫేజ్-2లో 1200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

చంద్రబాబుతో భేటీపై బిల్‌గేట్స్ ట్వీట్

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బిల్‌గేట్స్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సీఎం చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది. వైద్యం, వ్యవసాయం, విద్యల ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి రాష్ట్రానికి మద్దతునిస్తూ కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం.' అంటూ పేర్కొన్నారు.

జీవో 117కు ప్రత్యామ్నాయం తెస్తాం

రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకువస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతు బద్ధీకరణపై బుధవారం మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. లోకేశ్ మాట్లాడుతూ.. జీవో 117 వల్ల మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు 10,49,596 మంది విద్యార్థులు ప్రభత్వ పాఠశాలలకు దూరమయ్యారని అన్నారు.

Tags

Next Story