YSRCP Senior Leader : మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి ముద్రగడ..

X
By - Manikanta |21 July 2025 12:30 PM IST
కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు డయాలసిస్ చేయగా ఆయన ఆరోగ్యం ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు కాకినాడలోని మెడికవర్ ఆసుపత్రి నుంచి తొలుత రాజమండ్రి తరలించనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని కాపు నేతలు ఆకాంక్షించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com