Hydrabad: ఎంత నిర్భందించినా మసీద్‌ సర్కిల్‌కు వస్తాం

Hydrabad: ఎంత నిర్భందించినా మసీద్‌ సర్కిల్‌కు వస్తాం
X
కల్యాణదుర్గం టీసర్కిల్లో ఉద్రిక్త

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీ సర్కిల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి ఉషశ్రీ చరణ్‌కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి సవాల్ విసిరారు. మంత్రి ఉషశ్రీ అవినీతికి పాల్పడ్డారని తన వద్ద ఆధారాలు ఉన్నాయని హనుమంతరాయ చౌదరి అన్నారు. అంతేకాదు అవినీతికి పాల్పడలేదంటున్న మంత్రి ఉషశ్రీ బహిరంగ చర్చకు రావాలన్నారు. ఆధారాలతో సహా ఆయన చర్చకు వస్తానని తెలిపారు. అందుకు వేదికగా మసీదు సర్కిల్‌ని అనౌన్స్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యగా కల్యాణదుర్గం వ్యాప్తంగా టీడీపీ నేతల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇక ఎన్ని నిర్బంధాలు పెట్టినా మసీద్‌ సర్కిల్‌కు వస్తామని టీడీపీ నేతలు వెల్లడించారు.

Tags

Next Story