Botsa Satyanarayana : నీతులు చెబుతున్న బొత్స.. టూ మచ్ కామెడీ..

వైసిపి నేతల తీరు ఎలా ఉంది అంటే తప్పు చేసినవాళ్లే నీతులు చెప్పితే ఎలా ఉంటుంది.. ఇప్పుడు వైసీపీ నేతల తీరు కూడా అలాగే ఉంటుంది. పనిచేయడం చేతకాని వాళ్లు పనితనం గురించి గొప్పగా చెప్పుకుంటే ఎంత కామెడీగా ఉంటుంది.. ఇప్పుడు శాసనమండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నీతులు చెబితే అలాగే కామెడీగా అనిపిస్తుంది చూసేవారికి. చట్టసభలలో గౌరవంగా మాట్లాడాలని.. ప్రతిపక్షాలను గౌరవించాలని బొత్స సత్యనారాయణ చెప్పడం మహావిడ్డూరం అంటున్నారు కూటమినేతలు. ఎందుకంటే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను ఎన్ని బూతులు తిట్టారో అందరికీ తెలుసు. నిండు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ఎంతగా అవమానించారో.. మహిళలను ఎంత దారుణంగా అనకూడని మాటలు అన్నారో ఇప్పటికీ రికార్డుల్లో ఉంది.
మరి బొత్స సత్యనారాయణకు అప్పుడు నీతులు గుర్తుకు రాలేవా అంటున్నారు కూటమినేతలు. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని పట్టుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యంత దారుణంగా మాటలు అంటుంటే బొత్స సత్యనారాయణ ఒక్కసారి కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారు. అప్పుడు కూడా ప్రతిపక్ష నేతలను గౌరవించాలి అని అప్పుడు మంత్రి స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ ఒక మాట చెప్పి ఉంటే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా సరే దానికి గౌరవం, ఒక అర్థం ఉండేది.
కానీ అప్పుడు ఏం మాట్లాడకుండా ఇప్పుడు మాత్రం నీతులు చెబితే వినేవారికి కూడా చాలా విడ్డూరంగానే అనిపిస్తుంది అనేది బొత్స సత్యనారాయణ గుర్తుంచుకోవాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేది చరిత్ర చెప్పిన సత్యం. అప్పుడు మంత్రిగా ఉండి చెలరేగిపోయిన బొత్స సత్యనారాయణను ప్రజలు దారుణంగా ఓడిస్తే.. దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది పోయి.. ఇప్పటికి వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతుంటే కనీసం కంట్రోల్ చేయట్లేదు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం చట్టసభల్లో ఎంతో గౌరవంగా వ్యవహరిస్తోంది. కూటమి నేతలు ఒక్కరు కూడా మాట జారట్లేదు. చాలా హుందాగా మాట్లాడుతున్నారు. వైసిపి ఎమ్మెల్యేలకు గౌరవం ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ కూడా ఇచ్చారు. అయినా సరే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని అసెంబ్లీకి రాకుండా చట్టసభలను ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నారు.
Tags
- YSRCP leaders controversy
- Botsa Satyanarayana comments
- Andhra Pradesh Legislative Council debate
- Chandrababu Naidu assembly row
- AP coalition government
- YS Jagan Mohan Reddy assembly boycott
- political hypocrisy AP
- legislative decorum controversy
- Andhra Pradesh politics news
- YSRCP vs TDP discussion
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
