AP : నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది.. మాధురి భర్త మహేష్

AP : నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది.. మాధురి భర్త మహేష్
X

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురిల ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. అయితే ఈ వ్యవహారంలో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారనే మనస్తాపంతో తన కారును మరో కారుతో గుద్ది ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తాజాగా ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ వివాదం పై అమెరికాలో ఉంటున్నదివ్వెల మాధురి భర్త మహేష్ చంద్రబోస్ స్పందించారు.

తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. మాధురి ఇష్టపడటంతోనే వైసీపీలోకి వెళ్లడానికి మద్దతు తెలిపానని వెల్లడించారు మాధురి భర్త. తన భార్య పై తనకు పూర్తి నమ్మకం ఉందని.. తన భార్య రాజకీయంగా ఎదుగుతుందనే కారణంతోనే కొందరూ ఈ ఆరోపణలు చేస్తున్నారని భార్య మాధురికి ఆయన మద్దతు తెలిపారు. వాణి రాజకీయ కోణంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆ కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని చెప్పుకొచ్చారు మాధురి.

Tags

Next Story