ఐ- టీడీపీ యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు

X
By - TV5 Digital Team |24 Dec 2020 9:36 PM IST
సాంకేతికతలో మిగతా పార్టీల కన్నా ఓ అడుగు ముందుండే తెలుగుదేశం పార్టీ తాజాగా మరో అడుగు ముందుకేసింది. నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య వారధిగా ఉండే ఐ- టీడీపీ యాప్‌ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలపై తమ గొంతు వినిపించే వేదికగా ఈ యాప్‌ను డిజైన్ చశారు. సోషల్ మీడియా వేదికలు అన్నింటిని ఒకేచోట క్రోడీకరించే వన్ స్టాప్ యాప్‌గా... ఈ ఐ-టీడీపీ యాప్ ఉపయోగపడుతుంది. దీని వాలంటీర్ల ద్వారా ప్రతి సమాచారం క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. స్థానిక అంశాల గురించి పార్టీ ప్రతి కార్యకర్త రియల్ టైమ్‌లో పోస్ట్ చేయవచ్చు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com