నరసాపురానికి వందేభారత్ తీసుకొస్తాను - కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. రైల్వే, జాతీయ రహదారులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. వందేభారత్ రైలును నరసాపురం వరకు తీసుకురావడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. అలాగే అత్తిలిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్‌లు, తాడేపల్లిగూడెంలో వందేభారత్ హాల్ట్ ఏర్పాటు చేయడానికి, అరుణాచలం రైలు సర్వీసులను క్రమబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ ఫీల్డ్ హైవేకు కూడా అనుమతి మంజూరు చేశారని తెలిపారు.
భీమవరానికి పక్క రాష్ట్రాలలో కూడా మంచి పేరు ఉందని, ముఖ్యంగా అతిథి మర్యాదలకు ఈ ఊరు పెట్టింది పేరు అని మాధవ్ ప్రశంసించారు. ప్రధాని మోదీ స్ఫూర్తితోనే 'సారథ్యం' యాత్ర నిర్వహిస్తున్నామని.. స్థానికుల సమస్యలను తెలుసుకోవడమే 'చాయ్ పే చర్చ' ముఖ్య ఉద్దేశమని వివరించారు. జీఎస్టీ శ్లాబ్ రేట్లను సరళీకృతం చేయడం వల్ల మధ్యతరగతి ప్రజలకు, చిన్న వ్యాపారులకు లాభం చేకూరిందని అన్నారు. ఇతర దేశాలు ద్రవ్యోల్బణంలో చిక్కుకున్న సమయంలో మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన హర్షించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com