లోకేష్ ఘనత.. విశాఖకు ఐబీఎమ్ రాక..!

విశాఖను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే విశాఖకు ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు వస్తున్నాయి. దీంతో ప్రపంచ ఐటీ హబ్ గా విశాఖ మారుతోంది. విశాఖను కూటమి ప్రభుత్వ హయాంలోనే పూర్తి స్థాయి ఐటీ హబ్ గా మార్చేందుకు మంత్రి నారా లోకేష్ ఎంతగా కృషి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఆయన హయాంలో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి. తాజాగా ప్రపంచ టాప్ ఐటీ సంస్థ ఐబీఎమ్ విశాఖలో అడుగు పెట్టింది. గూగుల్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ లాంటి ఐటీ కంపెనీల దారిలోనే ఐబీఎమ్ తన కొత్త ఆఫీస్ ఏర్పాటు చేసింది. దీంతో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇదో పెద్ద గుడ్ న్యూస్ అంటున్నారు ఐటీ నిపుణులు.
ఇసుకతోట జంక్షన్ లో ఈ ఆఫీస్ ఏర్పాటు చేసింది ఐబీఎమ్. ప్రస్తుతం ఐదువేల మంది ఉద్యోగులు అక్కడ ఉండబోతున్నారు. సొంత క్యాంపస్ ఏర్పాటుకు భూమి కేటాయించాలని ఐబీఎమ్ కోరగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గత వైసీపీ హయాంలో వెనక్కు వెళ్లిన ఐబీఎమ్.. ఇప్పుడు మళ్లీ ఏపీకి వచ్చింది. దీని వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఈ విషయంపై మంత్రి లోకేష్ కృషిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.
ఎందుకంటే గతంలో ఐబీఎమ్ తో ఆయన చర్చలు కూడా జరిపారు. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం చూసి ఐబీఎమ్ ఏపీ నుంచి వెళ్లిపోయింది. కానీ కూటమి హయాంలో ఐటీ కంపెనీలకు అందిస్తున్న సపోర్టు, ప్రోత్సాహకాలను మంత్రి నారా లోకేష్ వివరించడంతో ఐబీఎమ్ తిరిగి ఏపీకి వచ్చింది. ఇలా ఐటీ ప్రపంచ మేటి కంపెనీలు ఏపీకి వస్తే ఇక్కడి నిరుద్యోగులకు ఇదో పెద్ద అవకాశం అవుతుందని అంటున్నారు నిపుణులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
