ఆనందయ్య కరోనా మందు... నేటి సాయింత్రం కృష్ణపట్నం చేరుకోనున్న ICMR టీం

ఆనందయ్య కరోనా మందు... నేటి సాయింత్రం కృష్ణపట్నం చేరుకోనున్న ICMR టీం
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై అధ్యయనం చేసేందుకు సాయంత్రం ICMR బృందం కృష్ణపట్నం చేరుకోనుంది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై అధ్యయనం చేసేందుకు సాయంత్రం ICMR బృందం కృష్ణపట్నం చేరుకోనుంది. రేపు మందు తయారీ పరిశీలించనున్నారు. అటు ఈ అనందయ్య ఇస్తున్న మందును నాటుమందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద మందు కాదని దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవీ ఇందులో పాటించలేదని తెలిపారు. అయితే ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని స్పష్టం చేశారు.

కంటిలో వేసే డ్రాప్ లోనూ సాధారణ పదార్థాలే ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. నిన్న ఆయుష్ ప్రతినిధుల బృందం ఆనందయ్య మందు తయారీని ప్రత్యక్షంగా పరిశీలించింది. అనందయ్య మందును పరిశీలించడానికి ముందే ల్యాబ్లో దాని నమూనాలను పరిశీలించినట్లు అయిష్ కమిషనర్ రాములు తెలిపారు. ఆ ఫలితాలు క్షేత్రస్థాయి అధ్యయనం మందు తీసుకున్న వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆనందయ్య మందును నాటు మందుగా పరిగణిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మందు వినియోగంలో ఎవరికి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఆనందయ్య నాటు మందు పై ఢిల్లీలోని సెంట్రింగ్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ కి నివేదిక పంపించినున్నట్లు ఆయన వెల్లడించారు.. తిరుపతి, విజయవాడ లోని ఆయుర్వేద వైద్య బృందాలు కూడా అనందయ్య మందును పరిశీలించి నివేదికను తయారు చేయనున్నట్లు చెప్పారు. ఈ రిపోర్టులన్ని వచ్చాకే మందు పంపిణీ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తమ పరిశీలనలో మందు తయారీకి సంబంధించి ఎక్కడ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని స్పష్టం చేశారు. అటు టీటీడీ ఆయుర్వేద విభాగం ఆనందయ్య మందును పరిశీలించింది.



Tags

Read MoreRead Less
Next Story