Andhra Pradesh News : వైసీపీ కామెడీ సర్వే.. ఆ మాత్రం చూసుకోరా..!

కూటమి ప్రభుత్వ పాలన మీద ఓ సర్వే బాగా వైరల్ అవుతోంది. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా.. వైసీపీ గ్రాఫ్ పెరిగిందా అనే విషయాలపై ఈ సర్వే చేశారంట. IITians Hyderabad Survey ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీసింది. ఈ సర్వే చేసిన విధానం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పటి నాలుగేళ్లు గడిచాక ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది.. ఎవరికి అనుకూలంగా ఉన్నారు, ఎవరిని వ్యతిరేకిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. కానీ కనీసం రెండేళ్లు కూడా కాకముందే ఏ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది అన్న రేంజ్ లో ఈ సర్వే ఇవ్వడం ఏంటో మరి వాళ్లకే తెలియాలి. అయితే ఈ సర్వే కోసం 50 వేల మంది దాకా సంప్రదించారని అంటున్నారు.
అందులో నిరుద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులను సంప్రదించి అభిప్రాయాలు తీసుకున్నారంట. ఇది నిజంగా ఫేక్ సర్వే అని తేలిపోతోంది. ఎందుకంటే రెడ్ జోన్ లో టీడీపీ వాల్లు 73 మంది ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు 12 మంది, బీజేపీ ఎమ్మెల్యేలు 7 మంది ఉన్నారంట. కానీ వైసీపీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్ జోన్ లో లేరంట. అదే ఆరెంజ్ జోన్ లో అయితే టీడీపీ నుంచి 36 మంది ఎమ్మెల్యేలు, జనసేన నుంచి ఐదుగురు ఉన్నారంట. ఇందులో బీజేపీ నుంచి ఒక్కరు కూడా లేరు. అయితే ఈ ఆరెంజ్ జోన్ లో కూడా ఒక్క వైసీపీ ఎమ్మెల్యే లేకపోవడం ఇక్కడ గమనించాలి.
ఇక చివరకు గ్రీన్ జోన్ లో అంటే సేఫ్ జోన్ లో ఉన్న వాళ్లలో టీడీపీ వాళ్లు 27 మంది ఎమ్మెల్యేలు ఉంటే, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఇక కామెడీ విషయం ఏంటంటే వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్ లోనే ఉన్నారని ఈ సర్వే చెప్పింది. అంటే ఇదెంత ఫేక్ సర్వేనో ఇక్కడే అర్థమైపోతోంది కదా. 11 మందిలో ఒక్కరు కూడా రెడ్, ఆరెంజ్ జోన్ లో లేకపోవడం అంటే జనాలు నవ్వుతారనే కనీస ఆలోచన కూడా లేకుండా దీన్ని కంప్యూటర్ లో టైప్ చేయించేశారు. ఇదంతా కంప్యూటర్ ముందు పెట్టుకుని రెడీ చేసిన సర్వే అని ఇట్టే తెలిసిపోతోంది. ఎందుకంటే వాళ్లు చెబుతున్న 50వేల మంది ప్రజల్లో ఒక్కరు కూడా ఏపీలో లేరు. అంటే ఒక్కరిని కూడా అడగకుండానే సొంతంగా దీన్ని రెడీ చేసేసి ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సర్వేలను నమ్ముకుంటే జగన్ కు ఈ సారి 11 సీట్లు కూడా రావంటున్నారు రాజకీయ నిపుణులు.
Tags
- IITians Hyderabad Survey
- AP Politics
- Andhra Pradesh Coalition Government
- Fake Survey Allegations
- Viral Political Survey
- YSRCP Survey Claims
- TDP Jansena BJP Alliance
- YS Jagan Mohan Reddy
- Election Survey Controversy
- Red Zone Orange Zone Green Zone Survey
- AP Public Opinion Poll
- Political Experts Reaction
- Survey Credibility Issues
- Computer Generated Survey
- AP Election Analysis
- Coalition Government Performance
- Fake Opinion Poll
- Andhra Pradesh Elections
- YSRCP Graph Down
- Political Propaganda
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

