ఆశ్చర్యకర రీతిలో ఏపీలోకి అక్రమంగా మద్యం సరఫరా

ఏపీలో మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. పోలీసుల కళ్లుగప్పేందుకు.. ఆశ్చర్యపోయే రీతుల్లో రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. ఇతర రాష్ట్రాల నుంచి యథేచ్చగా లిక్కర్‌ను తరలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో భారీగా మద్యం అక్రమంగా బారీగా మద్యం పట్టుబడింది. వాటర్ ట్యాంటర్‌లో మద్యం సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. అమరావతి మండలంలో 10వేల బాటిళ్ల తెలంగాణ మద్యంను సీజ్ చేశారు పోలీసులు. ఎవరికీ అనుమానంగా రాకుండా వాటర్ ట్యాంకర్‌లో తరలిస్తుండగా.. కాపుకాచి చాకచక్యంగా మునుగోడు వద్ద పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా ఈ మద్యాన్ని తరలిస్తున్నారు. సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారస్తున్నారు.
Next Story