ధూళిపాళ్ల నరేంద్రకు అస్వస్థత..!

సంగం డెయిరీ కేసులో అరెస్ట్ అయిన ధూళిపాళ్ల నరేంద్ర నిన్నటి నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఏసీబీ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు ధూళిపాళ్ల. మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కోరుతున్నారు. దీనిపై ధూళిపాళ్ల తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయి.. రాజమండ్రి జైలులో ఉన్న సంగం డెయిర్ మాజీ ఎండీ గోపాలకృష్ణకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు గోపాలకృష్ణ. నిన్న సడెన్‌గా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో.. జైలు అధికారులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొవిడ్ టెస్టులో పాజిటివ్ రావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. గోపాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com