RAIN ALERT: తెలుగు రాష్టాల్లో భారీ వర్షాలు... హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ

RAIN ALERT: తెలుగు రాష్టాల్లో భారీ వర్షాలు... హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ
మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షలు కురుస్తాయన్న వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టీ నుంచి 3 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మూడు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉంది. రాయలసీమతోపాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. హైదరాబాద్‌లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మల్కాజిగిరి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, నల్గొండ, మహబూబాబాద్, కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కూడా ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కేరళ, గోవా ఉన్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌ గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ హైవే సహా 115కు పైగా రహదారులు మూతపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో చాలా రహదారులు మూసుకుపోగా, కొన్ని కొట్టుకుపోయాయి. ఇప్పటికే చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు. దీంతో వివిధ ప్రాంతాల్లో 6 వేల మంది భక్తులు చిక్కుకుపోయారు.

వాయు నాణ్యత ఎలా ఉందంటే..?

తెలంగాణలో వాయు నాణ్యత స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తెలంగాణలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI) 65గా నమోదవుతూ వస్తోంది. ఇలా స్థిరంగా కొనసాగుతుండడం వల్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఇవాళ కూడా 65గా నమోదైంది. హైదరాబాద్‌లోనూ వాయు నాణ్యత ప్రమాణం ఇవాళ చాలా మెరుగ్గా నమోదైంది. చాలా రోజుల తర్వాత భాగ్యనగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌.... గుడ్‌గా నమోదైంది. హైదరాబాద్‌లో ఇవాళ వాయు నాణ్యత 50గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో వాయు నాణ్యత మెరుగ్గానే ఉంది. గతంలోలానే స్థిరంగా కొనసాగుతోంది. ఏపీలో ఇవాళ వాయు నాణ్యత 55గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ గాలిలో 2.5 పీఎం దూళి కణాలు ప్రమాదకరస్థాయి కంటే తక్కువగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ గణాంకాలు తెలిపాయి.

Tags

Next Story