8 Feb 2021 10:09 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / AP Panchayat Elections...

AP Panchayat Elections 2021 : పంచాయతీ ఎన్నికల వేళ పట్టుబడుతున్న అక్రమ మద్యం!

AP Panchayat Elections 2021 : ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ మద్యం రవాణా జోరందుకుంది. తెలంగాణ నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలకు అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

AP Panchayat Elections 2021 : పంచాయతీ ఎన్నికల వేళ పట్టుబడుతున్న అక్రమ మద్యం!
X

 అక్రమ మద్యం

AP Panchayat Elections 2021 : ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ మద్యం రవాణా జోరందుకుంది. తెలంగాణ నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలకు అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 9 లక్షల విలువ గల 7 వేల మద్యం సీసాలను సీజ్‌ చేశారు. ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఇటు కృష్ణా జిల్లా నందిగామలో తనిఖీలు చేస్తుండగా ఆటోలో భారీగా మద్యం సీసాలను గుర్తించారు. సుమారు 3 వేల మద్యం బాటిళ్లను, ఆటోను సీజ్‌ చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని మరో వ్యక్తి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.

Next Story