ఏపీలో దేవాలయాలపై దాడులను రాజ్యసభలో ప్రస్తావించిన బీజేపీ ఎంపీ జీవీఎల్

X
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను రాజ్యసభలో ప్రస్తావించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఏడాదికాలంలో 140 ఘటనల్లో దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. రామతీర్థంలో రాముడు విగ్రహం తల తొలగించడం, అంతర్వేధిలో రథం దగ్ధం వంటి ఘటనలు జరిగినా.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. వ్యక్తులపై రాజకీయ ఆరోపణలు చేస్తోందన్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నప్రభుత్వం.. దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని కామెంట్ చేశారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశంపై కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని జీవీఎల్ కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
