చంద్రబాబు దాడి చేసి ఏం సాధించారు.. మావోయిస్టులు మారాల్సిందే

మావోయిస్టులు తుపాకీ పట్టుకుని రాజ్యాధికారాన్ని సాధించలేదు. తుపాకీతో రాజ్యం ఈ రోజుల్లో మారదు. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల అంతం జరిగేలాగే కనిపిస్తోంది. కానీ టెక్నాలజీ ప్రపంచంలో ఈ రకమైన దారితో ఏం సాధిస్తారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. కులాల మధ్య చిచ్చులు పెట్టే వారు, ప్రజలను హింసించే వారు, కొన్ని వర్గాలను బానిసలుగా చూసే వారిపై ఒకప్పుడు తుపాకీ పనిచేసింది. కానీ రాను రాను చదువు, టెక్నాలజీ పెరిగి అందరూ ప్రశ్నిస్తున్నారు. చట్టాల గురించి అందరూ తెలుసుకుంటున్నారు. ఈ సమయంలో కూడా తుపాకీతో సాధించేది ఏమీ ఉండదు. పైన చెప్పిన వారు అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో ఉంటారు.
కానీ చంద్రబాబు నాయుడు ఆ కోవలోకి అస్సలు రారు. ఆయన కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేయరు. కేవలం అభివృద్ధి, సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడుతారు. అలాంటి చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు బ్లాస్ట్ చేసి నక్సలైట్లు ఏం సాధించారు. ఒకవేళ చంద్రబాబు విధానాలు నచ్చకపోతే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలి. తమ భావజాలాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. కానీ ఇవేవీ వాళ్లు చేయలేదు. మావోయిస్టుల భావజాలం వల్ల అవినీతి, దోపిడీ, హింస, లంచగొండితనం, పారిశ్రామీకరణ లాంటివి ఆగిపోలేదు.
వాళ్ల భావజాలం వల్ల 6వేల మంది దాకా చనిపోయారు. కానీ రాజ్యంలో ఏమైనా మార్పులు వచ్చాయా అంటే లేదు. చరిత్రలో వారికి ఒకప్పుడు మంచి పేరు ఉండేది. అందులో ఎవరూ అభ్యంతరం తెలపరు. కానీ ఈ టెక్నాలజీ యుగంలో చదువు మాత్రమే మార్పును తీసుకురాగలదు. కాబట్టి ఆపరేషన్ కగార్ లో చచ్చిపోవడం కంటే జనంలోకి రావాలి. వాళ్ల ఆశయాలను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చూపించాలి. అప్పుడే వాళ్లు చెప్పేది ప్రజలకు కూడా తెలుస్తుంది. చంద్రబాబు విధానాలు కూడా ఇలాంటివే కదా. ప్రాణాలు తీయడానికి చంద్రబాబు వ్యతిరేకం. మార్పును మాత్రమే చంద్రబాబు అంగీకరిస్తారు. కాబట్టి మావోయిస్టులు ఈ విషయంలో ఆలోచించాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

