AP : పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదులు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ప రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లలో జనసేన నేతలు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. సీఎం చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండటానికి పవన్ కల్యాణ్ నెలకు రూ.50 కోట్లు తీసుకుంటున్నారని దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసైన్యం తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపధ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఓవైపు దువ్వాడకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు వరుసగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, అమలాపురం, కొవ్వూరు పోలీస్ స్టేషన్లలో దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. దువ్వాడపై చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా అవనిగడ్డ మండల జనసేన అధ్యక్షుడు గుడివాక శేషుబాబు అవనిగడ్డ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే పెడన నియోజవర్గ జనసేన నాయకులు మచిలీపట్నం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే గుడివాడ, పామర్రు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. పవన్పై వ్యాఖ్యల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని జనసేన మహిళా కౌన్సిలర్లు సైతం డిమాండ్ చేశారు. ఈక్రమంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డీఎస్పీకి వారు ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com